పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే, ఎప్పుడు ఎవరని విమర్శిస్తాడో అర్ధకాకుండా ఉంది. గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీపై దాడిని తగ్గించి వైసిపి అధినేత వైఎస్ జగన్ మీద దాడి కొనసాగిస్తున్నారు. ఈ దాడితో వైసిపి నేతలు కొంత డిఫెన్స్ లో పడ్డారనే చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో వైసిపి నేతలతో పాటు, కార్యకర్తలు కూడా సినిమా చూసినట్లు చూస్తూ ఆనందంగా వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మరోసారి వైఎస్ జగన్ మీద చేస్తున్న దాడితో ఒక్కసారిగా రాజకీయాలలో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది.

వైసిపి అధినేతపై దాడిని తగ్గించి, ఇప్పుడు సడన్ గా మరోసారి దాడి చేయడంతో రాజకీయాలలో ఏవో పెను మార్పులకు నాంది పలుకుతున్నట్లు అనిపిస్తుంది. జనసేన ఇంత వరకు ఎన్నికల బరిలో దిగిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగితే ఎన్ని సీట్లు సాధిస్తుందనేది కూడా ప్రశ్నర్ధకంగా మారింది. ఈ పరిణామాలతో వైసీపీతో పొత్తు కోసం వెంపర్లాడటం, దానికి వైసిపి అనుకునన్ని సీట్లు ఇవ్వడానికి అంగీకరించలేదని, దీనితో పవన్ కళ్యాణ్… వైఎస్ జగన్ పై విమర్శలు కురిపిస్తునట్లు ఇన్సైడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు, జనంలో ఉండి నెలరోజుల్లో ఫామ్ హౌస్ లో ఉంటాడనేది ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తూ ఉంటాయి. జగన్ కు మగతనం ఉందా? అనే పదాలు వాడటం కూడా పొత్తుపై వైసిపి సరిగ్గా స్పందించకపోవడమే కారణం అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ వెళ్లి మాయావతిని కలవడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అప్పాయింట్ మెంట్ దక్కకపోవడంతో వెనుతిరిగి వచ్చారు. చంద్రబాబు నాయుడు… మాయావతిని కలవడానికి వెళ్లగా, ఆమె చంద్రబాబు నాయుడుని బయటకు వచ్చి మరీ సాదర స్వాగతం పలికింది. తెలుగుదేశం నేతలు అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ – చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై దాడిని పెంచి నేను వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు పెట్టుకొనని చెప్పి 175 స్థానాలలో పోటీకి సిద్ధం అని తెలియచేసారు.

ఒకవైపున మాయావతి పట్టించుకోక పోగా, మరోవైపు వైఎస్ జగన్ కూడా పొత్తు విషయమై లైట్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ కొంత అసహనానికి గురై తనను ఎవరు లెక్కచేయడం లేదని, వచ్చే ఎన్నికలలో తన సత్త ఏమిటో అందరికి చూపిస్తానని జనసేన నాయకుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నట్లు కనపడుతుంది. వైసిపి వర్గాలు మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ప్రజలతో మమేకమైతేనే 18 సీట్లు వచ్చాయి. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి తనకు ఇష్టమైన రాజకీయ విమర్శలు చేస్తూ, అభిమానుల చేత ఈలలు, గోలలు చేయించుకుంటే ఓట్లు పడతాయా అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు టిడిపి – జనసేనగా ఉన్న లొల్లి మరో సారి జనసేన – వైసీపీకి టర్న్ అయినట్లు కనపడుతుంది.

పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీతో పొత్తు విషయంలో నిజంగా బెడిసి కొడితే తెలుగుదేశం పార్టీతో కలసి ప్రయాణం చేసినా చేయవచ్చని, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకి కామన్ ఫ్రెండ్ లింగమనేని ఆ దిశగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయ విమర్శలే ఒక ఉదాహరణ.