ఏపీలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై మండి పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ రోజు సోషల్ మీడియాలో వరస ట్వీట్స్ చేశారు పవన్. విద్యుత్ కోతలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ఈ కోతలను ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే దసరా కానుకగా అనుకోవాలా అని ఆయన ఫైర్ అయ్యాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేశారని.. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ అన్నారు.

ఏ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు వంటి శుభంతో మొదలు పెడతారని.. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ఇల్లు పడగొట్టడం, జరిగే నిర్మాణాలను ఆపడం, రాజధాని లేకుండా చేయడం వంటి వ్యతిరేక పనులు చేస్తున్నారని అన్నారు. అలాగే భావన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేస్తున్నారని, ఆశా వర్కర్స్ ను రోడ్డు మీదకి తీసుకొచ్చి వారి మీద కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై మండి పడ్డారు.