ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 6 వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి జగన్ సర్కార్ తెలుగు విద్యను చంపేస్తుందని, తెలుగు విద్య పట్ల మీరు ఇదే విధమైన వైఖరితో ఉంటే మట్టి కొట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ రకరకాల ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్ని ఆరోపణలు చేస్తుంటే మీ కొడుకు కూతుర్లు ఏ మీడియంలో చదవుతున్నారని సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇక తెలుగు భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేస్తున్న లొల్లి తారా స్థాయికి చేరడంతో పాటు, జగన్ సర్కార్ ను వదిలేలా లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలకు మార్చే యోచనలో ఉన్నారని ప్రముఖ సినిమా అనలిస్ట్ కత్తి మహేష్ తన పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తెలుగు మాధ్యమంలో తన కొడుకుని చేర్పించినందుకు అభినందనలు అని కూడా కత్తి మహేష్ అన్నారు.

పవన్ కళ్యాణ్ నిజంగా తన కొడుకుని భాషపై ఉన్న ప్రేమతో తెలుగు మీడియంలోకి మారుస్తున్నారా లేక కత్తి మహేష్ పవన్ పై సెటైర్ వేసారా అన్నది తెలియాల్సి ఉంది. కత్తి మహేష్ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తన కొడుకుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అప్పుడు తెలుగు విద్యపై పోరాటం చేస్తే బాగుంటుంది లేకపోతే పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలకు ఎలాంటి విలువ ఉండదు. సరే మీకు తెలుగు విద్యపై అంత మక్కువ ఉంటే డబ్బున్న ధనవంతులు కాబట్టి మీ పిల్లవాడిని ఎక్కడైనా తెలుగులో బోధించే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే దానిలోనైనా చేర్పించవలసిన ఆవశ్యకత అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.