‘వకీల్ సాబ్’ సినిమా తరువాత పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మక కథ నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికరంగా సాగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు మరో టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు గతంలో హీరో రామ్ నటించిన ‘శివమ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మళ్ళీ అదే టైటిల్ ను పవన్ సినిమాకు పెట్టడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక ఇందులో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు హాలీవుడ్ నిపుణులు పనిచేయడం విశేషం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య మూవీస్ పై ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

భారత్ లో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 83,808 పాజిటివ్ కేసులు, 1,054 మరణాలు..!

ప్రముఖ ఓటిటిలో ‘నాంది’ మూవీ..!

గోవా ట్రిప్ లో ప్రియుడితో కలిసి నయన్ ఎంజాయ్..!