జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికలలో అత్యంత దారుణంగా దెబ్బతినడంతో చిరంజీవిలా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా మరొక పార్టీలో విలీనం చేస్తాడని ఒక రాజకీయ పార్టీని నడపడమంటే అంత సామాన్యమైన విషయం కాదని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ పార్టీని విలీనం అయితే చేయలేదుగాని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయ పబ్బం గడిపేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే చంద్రబాబు నాయుడు జేబులో మనిషని లోకమంతా తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలసి పొత్తు పెట్టుకోవడానికి కూడా విడిపోయిన బీజేపీ-టీడీపీ పార్టీలను ఒక్కటి చేయడమే అనే ఆరోపణలు ఉన్నాయి.

బీజేపీతో కలసిపోయిన పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైసీపీ ప్రబుత్వంపై ఘాటుగా స్పందిస్తూనే ఉంటారు. ఎన్ని పోరాటాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నా ఆ రీతిలో బీజేపీ పార్టీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ కు ఎప్పటికప్పుడు బాధగానే ఉంటుందట. కానీ ఇప్పుడు ఏపీలో నెలకొన్న మత రాజకీయాలలో బీజేపీ ఘాటుగా వైసీపీ పార్టీపై విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ కు కాస్త ఉత్సాహం వచ్చినట్లు తెలుస్తుంది. తనకు కోరుకున్నది త్వరలో జరుగుతుందని, వైసీపీ-బీజేపీ మధ్య మరింత అంతరం పెరిగితే చూసి ఆనందించాలని పవన్ ఎప్పటి నుంచి కంటున్న కల సాకారమవ్వడంతో పాటు టీడీపీతో కలసి బీజేపీ ముందుకు వెళితే జనసేన-బీజేపీ-టీడీపీ మూడు కలసి వైసీపీ వారిని రఫ్ఫాడించవచ్చని బావిస్తున్నారట.

కానీ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఎంత హడావిడి చేస్తూ వైసీపీపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కేంద్రంలో మాత్రం వైసీపీ పార్టీ నాయకులకు బీజేపీ పెద్దలు రెడ్ కార్పెట్ వేయడమే పవన్ కళ్యాణ్ కు కాస్త ఇంకా అసహనంగా ఉందని తెలుస్తుంది. వైసీపీ శ్రేణులు ఎవరు వెళ్లినా వారికి ఇట్టే అపాయింట్మెంట్స్ దొరికిపోతుండటంతో పాటు ఇంతవరకు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తరువాత తనకు ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదని బాధపడుతున్నారట.

బీజేపీ పెద్దలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను దూరం పెట్టడానికి కారణం గత ఎన్నికలలో జనసేన పార్టీ ఏపీలో ఎలాంటి హావ చూపించకపోవడంతో పాటు తాను నిలబడిన రెండు స్థానాలలో ఓడిపోవడంతోనే ఇప్పుడు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ అగాధాన్ని త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తగ్గించి పవన్ కళ్యాణ్ కు ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందని జనసేన శ్రేణులు కోరుకుంటున్నారు. ఇది త్వరలో జరగాలని మనం కూడా ఆశిద్దాం.

కేంద్రం నెత్తిన వంద లక్షల కోట్ల అప్పు, మన దేశంలో అవినీతిపరుల దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసా?

ఆకలితో ఉన్న బెట్టింగ్ రాయుళ్ల దాహం తీర్చడానికి వచ్చేస్తున్న ఐపీఎల్