ఏపీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ముఖ్యమంత్రి జగన్ కు అంటగడుతూ వైసీపీ కార్యకర్తలు ఉన్మాదులులా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేశంతో తెగ మాట్లాడేస్తుంటారు. ఇక ఈరోజు విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు కుటుంబం 20 ఏళ్ళ దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనలో మాత్రం ఏమి మాట్లాడకుండా మిన్నకుండిపోతున్నారు. దళితుల పక్షాన నిలబడతానని హడావిడి చేసే పవన్ కళ్యాణ్ ఎందుకు నూతన్ నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదనే వార్తలు వస్తున్నాయి.

ఇక జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ తమ పార్టీతో నూతన్ నాయుడుకి ఎలాంటి సంబంధం లేదని, దళిత యువకుడికి శిరోముండనం చేస్తే అది పవన్ కళ్యాణ్ కు ఎలా సంబంధం ఉంటుందని ఇటువంటి సంఘటనలలో అయన పేరు తీసుకురావద్దని అంటున్నారు. సరే అయన పేరు తీసుకురావాలని ఎవరు కోరుకోవడం లేదు, ఇలా ఒక దళిత యువకుడి పట్ల ఇంత అమానుశంగా వ్యవహరించిన నూతన్ నాయుడుని కఠినంగా శిక్షించాలని ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు.

పవన్ కళ్యాణ్ కు లక్షలలో అభిమానులు ఉంటారని వారిలో ఎవరో ఒకరు తప్పు చేస్తే అది పవన్ ను అట్టకట్టడం ఎంతవరకు సబబని పార్టీ నుంచి లేఖ విడుదల చేసిన దానిలో ముఖ్యమైన అంశం. మరి ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ పార్టీకి చెందిన ఎవరైనా ప్రత్యర్థులపై దాడి జరిగినప్పుడు సీఎం జగన్ కు అంటగట్టేలా పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు గురించి ఏమనుకోవాలి. అంటే మనదాకా వస్తే ఒకటి… పక్కవాడిపై బురద జల్లడానికైతే ఎలాగైనా ఏదో ఒక రీతిలో బురద జల్లవచ్చు అనేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో అతడిపై ఆగ్రహంతో నూతన్ నాయుడు “పరాన్నజీవి” అనే పేరుతో పవన్ కళ్యాణ్ ను సంతృప్తి పరిచేలా ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకు జనసైనికులందరు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో జనసైనికుల నుంచి నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానంటే నూతన్ నాయుడు అనే బిరుదుని కూడా సొంత చేసుకున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏమి ఆశించకుండా పవన్ కోసమే నూతన్ నాయుడు సినిమా తీసినట్లు అందరకి తెలిసిన విషయమే.

అందుకే ఇప్పుడు నూతన్ నాయుడుపై ఆరోపణలు చేయడానికి పవన్ కళ్యాణ్ కు మనస్సు రావడం లేదు. అంటే దళితుల కంటే పవన్ కళ్యాణ్ కు అతడి అభిమాని ముఖ్యమని చెప్పకనే చెప్పారు. పక్క పార్టీల వారి మీద బురద వేయడానికైతే పవన్ కళ్యాణ్ కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోవడం దారుణమైన విషయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రెండు నాలుకల ధోరణి కచ్చితంగా బయటపడిందని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.

తొలిసారి కన్నా రెండవసారి కరోనా సోకితే లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయంటున్న అమెరికా

సోషల్ మీడియాలో చివాట్లు పెట్టడంతో నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్

శిరోముండనం కేసులో నూతన నాయుడు భార్యే నిందితురాలట, వీడియో తీసి పైశాచికానందం