పవన్ కళ్యాణ్ త్వరలో సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మాతగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అమితాబచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో చేసిన “పింక్” సినిమా రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి జనవరి 2020 నుంచి షూటింగ్ మొదలు కావలసి ఉంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆ సినిమాను వాయిదా వేయడమే కాకుండా మరికొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ బావిస్తున్నాడట.

దానికి కారణం ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు ఈమధ్య జగన్ సర్కార్ పై ఇసుకతో పాటు తెలుగు విద్యను ఏపీ ప్రభుత్వం పూర్తిగా తొక్కేస్తుందని అనేకమైన ఆరోపణలు చేస్తూ లైమ్ లైట్ లో ఉంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు సినిమాలలోకి వస్తే తనపై మరింత ఎదురు దాడి చేయడంతో పాటు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని గగ్గోలు పెడతారన్న కారణంగా కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది.