ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తరువాత రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన అందరికి ఆహ్వానం ఉంటుంది. అప్పట్లో ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రెండు రాష్ట్రాల సీఎంలు పాల్గొనేవారు. అప్పట్లో గవర్నర్ కూడా రెండు రాష్ట్రాలకు ఒక్కరే ఉండటంతో హైదరాబాద్ లో వేడుక నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఏపీకి కొత్తగా గవర్నర్ ను నియమించడం… అమరావతిలోని రాజ్ భవన్ లో మొదటి సారి ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

అప్పట్లో ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా వచ్చేవారు. మిగతా సమయాలలో బయట కనపడకపోయినా ఎట్ హోం కార్యక్రమం మొత్తం అన్ని రాజకీయ పార్టీలతో నిండి పోవడంతో… అక్కడకి వస్తే సెంటర్ అఫ్ అట్రాక్షన్ కూడా అవ్వవచ్చని భావించి ఉండవచ్చు. కానీ నిన్న తాడేపల్లిలోనే జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. కారణమైతే తెలియదు గాని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం… సొంతగా రాష్ట్రానికి రాజ్ భవన్ తరలి రావడం, ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత లేదంటారా? లేకపోతే తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో ఎట్ హోం కార్యక్రమంలో రాజకీయ నాయకులకు మొహం చూపించుకోలేక కార్యక్రమానికి హాజరుకాలేదా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, బీజేపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన నేతలు ఎట్ హోం కార్యక్రమంలో సందడి చేసారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •