పవన్ కళ్యాణ్ 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాలలోకి అడుగుపెట్టినా తన రాజకీయ గురువు మాత్రం చద్రబాబులా ఫీల్ అవుతుంటాడు. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని ముందుండి రాజకీయాలు చేస్తుంటాడు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో నెటిజన్స్ బయటపెట్టారనుకోండి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో ఏకంగా చంద్రబాబు నాయుడు పూనినట్లు కనపడుతుంది. ఇద్దరు కలసి సహవాసం చేస్తే అతడు ఇతడిగా మారే సూచనలు దండిగా ఉంటాయని పాత కాలం నాటి మాటే.

దానికి తగ్గట్లుగా గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సిపిఐ, బిఎస్పీ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లే సమయంలో బీజేపీ పార్టీతో పాటు ప్రధాని మోదీని తిట్టని తిట్టు లేదు. అసలు మన దేశంలో మత రాజకీయాలు చేసేదే హిందువులని, మైనారిటీలు ఎప్పటికి అలాంటి పని చేయరని… కొంతమంది హిందువులు మత ఘర్షణల కోసం వారికే వారే చిచ్చు పెట్టి బయట గొడవలు చేసేస్తుంటారని, ఓట్లు చీల్చడానికి హిందూ నాయకులే ఇలాంటి పనులు చేస్తారని అన్నారు. కానీ ఎన్నికలు ముగిసాయి… పవన్ కళ్యాణ్ కు కొత్త గొడుగు కావలసి వచ్చింది. అదే బీజేపీ పార్టీ, అందులో చేరిపోయిన దగ్గర నుంచి ఒక బాబాలాగా ఆవతారమెత్తి హిందూ పరిరక్షణకు పాటుపడేది నేనే అనే రీతిలో బిల్డప్ ఇస్తున్నారు.

అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన రధం దగ్ధం విషయంలో పవన్ కళ్యాణ్ తన కుటిల రాజకీయ బుద్ధిని చూపించబోయి, తనను మించిన హిందుత్వవాది లేడని జనసేన శ్రేణులు రెచ్చగొట్టే పనికి పూనుకుంటే ఏకంగా జగన్ సర్కార్ ఈ కేసుని సిబిఐకు కేసుని అప్పగించడంతో మిన్నకుండిపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ తొ కలిసినప్పుడు మోదీని తిట్టడం, ఆ తరువాత పొగడ్తలతో మోదీ దేశానికి ఆదర్శం అంటూ ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెబుతూ దిక్కుమాలిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ కు కూడా ఆ బుద్ధులు వచ్చినట్లు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతలా తాను హిందువునని, జగన్ సర్కార్ ఏదో కుటిల ప్రయత్నాలు చేయబోయిందని చెప్పాలని ప్రయత్నం చేసినా గతంలో హిందూ మతం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక గజినీ లాగా తాను ఎప్పుడు ఏది మాట్లాడితే అదే ట్రెండీ అని నేను ఎప్పుడు ఎవరినైనా తిట్టేస్తానని అనుకుంటే నెటిజన్స్ చూస్తూ ఊరుకోరు కదా?