‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలో బిజీగా మారిన పవన్ కళ్యాణ్.. రెండేళ్ల తరువాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమా రీమేక్ ద్వారా ఆయన రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలు లాయర్ సాబ్ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో ఈ సినిమాలో ఆయన ఎంట్రీ సీన్ ను భారీఎత్తున ప్లాన్ చేస్తున్నారు. భారీ ఫైట్ సీన్ తో పవన్ ఎంట్రీ ఉండబోతుందని.. దీనికోసం ప్రత్యేక సెట్ వేయిస్తున్నారట. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటలు కూడా కంపోజ్‌ చేశారట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేం నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. చారిత్రాత్మ‌క కాలం నాటి ఓ ఎమోషనల్ విప్లమాత్మక సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో పవన్ మంచి కోసం పోరాడే ఓ దొంగగా నటించబోతున్నాడు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వీరూపాక్షి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.