జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆదివారం రాత్రి మలికిపురం పోలీస్ స్టేషన్ లో అనుచరులతో కలసి ధర్నా చేయగా, ప్రభుత్వం ఆస్తులు ధ్వంసం చేశారని అతని మీద కేసు నమోదయింది. సోమవారం రాపాకను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఇక ఈరోజు మధ్యాహ్నం రాపాక తానే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రాపాకను పోలీసులు కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్నారు.

దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రజల తరుపున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని, మలికిపురం గొడవ గోటిదాకా పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి జర్నలిస్ట్ పై దాడి చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

పోలీసులు రెండు రోజుల క్రితం పేకాట ఆడుతున్న కొంత మంది స్థానికులను అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్న వారికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వత్తాసు పలకడంతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి గొడవ చేయడంతో ఎస్ఐతో ఎమ్మెల్యే వాగ్వివాదానికి దిగడంతో దాదాపుగా ఎమ్మెల్యేకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు అసలు జరిగిన విషయం తెలుసో లేదో… రాపాక ఒకవేళ పేకాట బ్యాచ్ కు వత్తాసు పలకడం వలనే ఈ లొల్లి జరిగిందన్న విషయాన్ని జనసేన అధినేత సమర్ధించనున్నారా? దీనిపై కూడా క్లారిటీ ఇస్తే బాగుండేది.

  •  
  •  
  •  
  •  
  •  
  •