సోషల్ మీడియా దెబ్బకు మారుమూల ప్రాంతాలలో చిన్న సంఘటన జరిగినా క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారుతుంది. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే గుంటూరుతో పాటు పలుచోట్ల జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీసుల ముందు టూలెట్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. జనసేన పార్టీ నేతలు గెలవలేమని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఆగకుండా తమ కార్యాలయాలు ఖాళీ చేస్తున్నారని వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యులు ట్రోలింగ్ కు దిగారు.

ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయంపై స్పందిస్తూ తన పార్టీ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని, ఇది ఆరంభం మాత్రమే అని, ముందు ముందు మంచి కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్తామని తన పార్టీ నాయకులకు తెలియచేసారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పినంత కార్యాలయాలు తీసివేయకుండా జనసేన పార్టీలో యాక్టీవ్ గా ఉంటారా లేదా అనేది చూడవలసి ఉంది.