వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందరభంగా ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ పోరాట యాత్రలలో సినిమా తక్కువ ఇంటెర్వెల్స్ తక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయాలని, తమకు పవన్ కళ్యాణ్ వారితో కలిస్తే వచ్చే ఇబ్బంది లేదని తాము మాత్రం వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు అదే రీతిలో కౌంటర్లు ఇస్తూ తాను చేసే పోరాట యాత్రలో ఇంటర్వెల్స్ ఎక్కువ అని జగన్ అనప్పుడు ప్రతి శుక్రవారం కోర్ట్ లో హాజరవ్వడానికి హైదరాబాద్ గురువారమే బయలుదేరి వెళ్ళిపోతారనని, దీనిని ఏమనాలని పవన్ సమాధానమిచ్చారు. చంద్రబాబుని ఇబ్బందులకు గురి చేయడానికి కేసీఆర్, మోదీ, జగన్ కుట్రలు పన్నుతున్నారని తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని, వారు చేసే వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోనని పవన్ వ్యాఖ్యానించారు.