పవన్ కళ్యాణ్ చెప్పే వంకర టింకర సమాధానం ఒక్కోసారి జనసేన పార్టీ శ్రేణులు కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. ఎవరు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ కు కావాల్సింది చివరిగా చంద్రబాబు నాయుడు చల్లని నీడలో సేదతీరడం. చంద్రబాబు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీడలో సేదతీరుతుంటే ఆ నీడను పట్టుకొని తాను మరికొన్ని రోజులు తన పార్టీని నడుపుకోవచ్చన్న భావన. దీనికి కారణం ఏమిటో తెలుసా నిన్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేసేలా ఉంది.

అమరావతి మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్ తన ఇంటర్వ్యూ లో చెబుతూ బీజేపీ నాయకులు అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుతున్నారని అన్నారు. కానీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తమకు ఏపీ రాజధానితో సంబంధం లేదు అని చెప్పింది కదా అని అతడిని అడిగితే మాత్రం ఇలా తన వక్ర భాషలో చెప్పుకొస్తాడు. బీజేపీ వేరు, ఎన్డీఏ ప్రభుత్వం వేరట. ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాజధానులు పెట్టుకోవచ్చని చెప్పిందని, కానీ బీజేపీ మాత్రం అమరావతిలోని రాజధాని ఉండాలని కోరుతుందని చెబుతున్నాడు. అసలు ఎన్డీఏలో కీలక పార్టీ బీజేపీనే కదా? ఎన్డీఏలో అనేక పక్షాలు ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ సొంతగా తనకు కావాల్సిన సీట్లను తెచ్చుకుంది కదా? కానీ దాని గురించి అడిగితే ఏమని సమాధానం ఇచ్చేవాడో. కానీ ఆ పత్రిక అడగలేదు. పవన్ కళ్యాణ్ దానిని ఇంకా సాగతీయలేదు.

అసలు అమరావతి నుంచి రాజధాని వెళ్లిపోతుందంటే పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు. అమరావతిలో భూకుంభకోణం జరిగిందని బీజేపీ పార్టీ అక్కడ భూములపై విచారణ జరపాలని కోరుతుంటే పవన్ కళ్యాణ్ మాటైనా మాట్లాడడు కానీ అమరావతిలోని రాజధాని ఉండాలని మాత్రం కోరుతుంటాడు. దీనిపై బీజేపీలోనే కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ అనుకున్నది ఎప్పటికి జరగదని, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేవాటికి మాత్రం తన వాయిస్ వినిపిస్తూ చంద్రబాబు నాయుడుకి ప్రతికూలంగా సిబిఐ ఎంక్వయిరీ లాంటి వాటిలో మాత్రం మాట్లాడకుండా ఫార్మ్ హౌస్ లో కూర్చుంటాడని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.