పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కొడుకు అకీరా త్వరలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనునట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక మరాఠి సినిమాలో హీరోగా చేసిన అకీరా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందు రానున్నాడు. మరాఠి సినిమాను తెలుగులో అనువాదించి అకీరాను పరిచయం చేయాలని భావించినా స్ట్రెయిట్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు అకీరాను పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ బావిస్తున్నాడట.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు విడిపోయిన తరువాత కూడా తన కొడుకు అకీరాతో పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వెళ్లి చూసివస్తాడని, అతడి బాగోగులపై శ్రద్ధ పెట్టడమే కాకుండా అతడికి ఫిల్మ్ ట్రైనింగ్ ఇవ్వడంలో చాల సహాయపడ్డాడని కూడా చెబుతుంటారు. ఇక ఈమధ్య రేణు దేశాయ్ కూడా తన కొడుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్ట నుండటంతో తన తండ్రి పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉంటాడని హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక రేణు కూడా బుల్లి తెర ద్వారా రీ నెటరీ ఇచ్చి త్వరలో హల్ చల్ చేయనుంది.

అకీరాతో తీయబోయే సినిమా స్వయంగా పవన్ కళ్యాణ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి నిర్మించాలని బావిస్తున్నారట. ప్రస్తుతానికి రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను ఇక సినిమాలలో నటించనని ఇప్పటికేర్ ప్రకటించినా… చాల మంది నిర్మాతలు అతడు ఎప్పుడు డేట్స్ ఇస్తాడా ఎప్పుడు సినిమాలలో నటిస్తాడా అని చూస్తున్నారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ కు కనుక రాజకీయాలపై దృష్టి సారించవలసి తన కొడుకు సినిమాకు నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం కష్టమైతే రామ్ చరణ్ నిర్మాణ సారధ్యం “కొణిదెల ప్రొడక్షన్స్”లో నుంచి లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇక అకీరా సినిమాను బారి బడ్జెట్ లో ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారసుడి ఎంట్రీకి అభిమానులు ఏవిధంగా స్వాగతం చెబుతారో చూడాలి. మెగా హీరోల సినిమాలనే ఆదరించే పవన్ అభిమానులు, ఇక పవన్ కొడుకు సినిమాకు చిందేయడం గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.