‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలో బిజీగా మారిన పవన్ కళ్యాణ్.. రెండేళ్ల తరువాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమా రీమేక్ ద్వారా ఆయన రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి 20న హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే పవన్ నటిస్తున్న ఈ సినిమాకు మొదట భారీ పారితోషికం ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తప్ప నాన్ థియేట్రికల్ రైట్స్ కి పెద్దగా డిమాండ్ లేదట. ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కారణం ఈ సినిమా మిగతా భాషలలో కూడా రిలీజ్ అయి.. అక్కడ టీవీలలో కూడా ప్రచారం అయ్యిందట. కావున ఈ సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించారని వినికిడి.

ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •