పవన్ కళ్యాణ్ ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాయకులతో అందుబాటులో ఉండనున్నారు. గత ఎన్నికలలో పార్టీ దారుణమైన ఓటమిని చవిచూడటంతో పాటు, ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు జనసేన పార్టీ నుంచి ఇతర పార్టీలకు నాయకులు వెళ్లిపోవడంతో దీనిపై నాయకులను పక్క పార్టీలలోకి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి అన్న దానిపై చర్చించనున్నారు.

మరోవైపున జనసేన పార్టీ దారుణ పరాజయం తరువాత కార్యకర్తలలో కూడా ఉత్సాహం కొరవడింది. ఇంకా ఎన్నికలకు ఐదేళ్లు ఉండటంతో సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అన్న అంశంతో పాటు కార్యకర్తలలో ఉత్సాహం నింపేదానిలో భాగంగా మరొకసారి సినిమాలలో నటిస్తే ఎలా ఉంటుంది అన్నదాని మీద కూడా చర్చ జరగనుందని తెలుస్తుంది. దీనితో పార్టీ అందుబాటులో ఉండే అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలిపారట.

ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “పింక్” సినిమా రీమేక్ హక్కులు దిల్ రాజు తీసుకోవడం ఈ సినిమా తెలుగులో దిల్ రాజు… పవన్ కళ్యాణ్ తో నిర్మించాలని భావించడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించేలా ఒప్పించే బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపున ఈ సినిమా కోసం 25 రోజులు డేట్స్ ఖరారు చేస్తే చాలని కూడా దిల్ రాజు చెప్పడంతో పవన్ కళ్యాణ్ కొంత ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది. ఈ రెండు రోజులలో సినిమాలో నటించే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మరోసారి సినిమాలలో నటిస్తున్నాడు అంటే అతడి అభిమానులకు ప్రతి రోజు పండగే.