మన దేశంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన డిమానిటైజషన్ తరువాత పేటిఎమ్ ద్వారా ఆన్లైన్ లో చెల్లింపులు విస్తృతంగా పెరిగిపోయాయి. ఒక చిన్న తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే అతని దగ్గర కూడా పేటిఎమ్ ఉండేది. అలా పేటిఎమ్ మన దేశంలో మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. అలాంటి పేటిఎమ్ ను నిషేధిస్తునట్లు, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక్కసారిగా తొలగించడంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. దీనిపై పేటిఎమ్ వివరణ ఇస్తూ త్వరలో పునరుద్ధరిస్తామని మీ డబ్బులకు తమదని బాధ్యత ఎవరకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.

చివరగా గూగుల్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించడంతో నిన్న రాత్రి మరోసారి గూగుల్ ప్లే స్టోర్ లో పేటిఎమ్ యాప్ ప్రత్యేక్షమవ్వడంతో యాజమాన్యం తమ సంతోషాన్ని ప్రకటించింది. దీనిపై పేటిఎమ్ సంస్థ ట్వీట్ చేస్తూ ఆండ్రాయిడ్ యాప్ పునరుద్ధరించామని, ఎప్పటిలాగే గూగుల్ తో కలసి పనిచేస్తామని, యూజర్లకు చెందిన నగదు బ్యాలెన్స్ ఖాతాలు 100 శాతం సురక్షితంగా ఉన్నాయని, యూజర్లు గతంలో వలే సేవలను వినియోగించుకోవచ్చని చెప్పుకొచ్చారు. దీనితో పేటిఎమ్ యూజర్ల ఆందోళనకు తెరపడిందని చెప్పుకోవచ్చు.

గంగవ్వకు కరోనా వైరస్ రూమర్లపై నిజమెంత?

విజయసాయిరెడ్డి కెలుకుడు మాములుగా లేదుగా, చివరకి ఎవరి తీగ తెగుతుందో

రాజుగారి ఉత్సాహం చూస్తుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నారే