అమెజాన్, ఫ్లిప్ కార్డ్ పోటీగా ఈరోజు నుంచి పేటీఎమ్ కూడా తన పేటీఎమ్ మాల్ ద్వారా మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ తో ముందుకు రానుంది. అందులో భాగంగా ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. HDFC బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లను అందిస్తుంది. ఇవే కాక కూపన్ ల పేరుతో కూడా మరొక ఆఫర్ కూడా రానుంది.

పండుగ అమ్మకాలలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు “price డ్రాప్స్” పేరుతో మరియు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫ్లాష్ సేల్స్ పేరుతో ఆఫర్లను అందించనుంది. అన్ని ఈ కామర్స్ సంస్థలు ఒకరని మించి మరొకరు ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు కూడా ఆఫర్లపై ఆసక్తి చూపిస్తున్నారు.