ప్రతిపక్షానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యమైన పీఏసీ చైర్మన్ పోస్ట్ కోసం తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య లుకలుకలు ఏర్పడ్డాయి. ఆ పోస్ట్ తనకు కేటాయించాలని గంటా శ్రీనివాస రావు… చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మెన్ గా పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేయడం జరిగింది. ఈమేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం కు ప్రతిపాదనలు పంపారు.

పయ్యావుల కేశవ్ కూడా ఈ మధ్య పార్టీ మారనునట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ పార్టీలో చేరడానికి చర్చలు జరిపాడని, అవసరమైతే తాను మరోసారి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమని కూడా ప్రతిపాదనలు పంపాడట. కానీ వైసీపీ నాయకత్వం పయ్యావుల కేశవ్ పట్ల అంత మక్కువ చూపించినట్లు లేరు. పయ్యావుల కేశవ్ కూడా తాను ఎప్పుడు అసెంబ్లీకి ఎంపికైతే అప్పుడు తన పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో, ఈసారి ఎలాగైనా ప్రభుత్వంలో భాగస్వామి అవ్వాలనే ప్రయత్నించాడట. ఇక పయ్యావుల కేశవ్ బాధను అర్ధం చేసుకున్నాడో ఏమో గాని చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టి సంతృప్తి పరిహదు. మరి గంటా పరిస్థితి ఏమిటో?
  •  
  •  
  •  
  •  
  •  
  •