వివాహమైన కొద్దీ సేపటికే వరుడు మంగలి గణేష్(25) మృతి చెందడంతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది. గణేష్ కి శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. ఇక రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బరాత్ నిర్వహించారు. ఇక ఆ బరాత్ లో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కి గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన గణేష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్య పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో వరుడు మృతి చెందాడు. దీంతో నవ వధువుతో పాటు పెళ్ళికొడుకు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.