గాఢంగా ప్రేమించుకున్న ఒక జంట పెళ్ళిచేసుకోవాలని నిచ్ఛయించుకొని ఇంట్లో తల్లితండ్రులను ఒప్పించాలనుకునే ప్రయత్నంలో ప్రేమికులిద్దరు ఇరువురి తల్లితండ్రులతో చెప్పడంతో మొత్తానికి ఒక సిటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా యువతి తండ్రి తన కూతురుని అతగాడికి ఇవ్వడానికి అంగీకరించలేదు. పెళ్ళికొడుకు తండ్రి ఎంత బతిమిలాడిన పెళ్ళికి ససేమీరా అనడంతో తన కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆ యువకుడు తండ్రి కోపం పట్టలేక పక్కనే ఉన్న కత్తి తీసుకొని అమ్మాయి తండ్రిని పొడిచిపారేసాడు.

దీనితో అమ్మాయి తండ్రి అక్కడక్కడే మృతి చెందటంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజులలో ప్రేమికులు ఇంట్లో చెప్పడానికి బయపడి పారిపోయి పెళ్లిచేసుకుంటుంటే వీరు మాత్రం తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకుంటే వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి హత్యకు దారి తీయడంతో రెండు కుటుంబాలలో విషాదంతో పాటు వారి ప్రేమ పెటాకులైపోయింది.

అయోధ్య రామమందిర భూమి పూజను ఎంత మంది వీక్షించారో తెలుసా?

సమంత డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలట

రాఘవేంద్రరావు కొడుకుతో విడాకులు, మరొకరితో రిలేషన్ షిప్