1988లో బిఆర్ చోప్రా నిర్మించిన “మహాభారత్” సీరియల్ ఎంతో ఆదరణను చూరగొంది. ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో మరొకసారి అప్పటి క్యాసెట్స్ దుమ్ము దులిపి డిడి నేషన్ లో ప్రసారం చేస్తున్నారు. “మహాభారత్” అంటే అమితాసక్తి చూపించే మన భారతీయులు అప్పటి ఈ దృశ్య కావ్యాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో శకుని పాత్ర చేసిన “గుఫీ” అప్పటి తన అనుభవాలను చెప్పుకొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ముందుగా తనను “మహాభారత్”లో శకుని పాత్రకు ఎంపిక చేసినప్పుడు ఆ పాత్రను చేయడానికి తాను చాల ఆనందించానని, తరువాత ఆ పాత్ర ప్రేక్షకులలో గొప్పగా పడటంతో పాటు, తాను పాండవులను కించపరిచేలా కౌరవుల పక్షం ఉండి చేసిన ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలు ఓర్చుకోలేకపోయారని, తనను బయట కూడా ఎంతో మంది ద్వేషించడం మొదలుపెట్టారని, కొంతమంది చాలా గొప్పగా నటించారని లేఖలు రాస్తే, మరికొంతమంది ద్వేషిస్తూ లేఖలు రాసారని, ఆ సమయంలో తనకు బాగా గుర్తని ఒక లేఖలో ఒక పెద్ద మనిషి నువ్వు చెడు పనులు చేయడం మానేయాలని, లేకపోతే నీ కాళ్ళు విరగగొడతానని వార్నింగ్ ఇచ్చిన సంఘటన తనకు ఇప్పటికే గుర్తే అని “గుఫీ” చెప్పుకొచ్చారు. తనను ఎంతో మంది ద్వేషంతో ప్రేమించారని, అప్పటి సంఘటనలు, నా పాత్రకు వచ్చిన గుర్తింపు, ఇప్పుడు మరొకసారి “మహాభారత్” ప్రసారం చేయడంతో మరొకసారి చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

గూగుల్ మ్యాప్స్ కాపురంలో కలతలు రేపింది..

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!