చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తీ పెరగడానికి రోజు కాస్త పెరుగు తినిపించడం వలన శరీరంలో ఉండే చేదు బ్యాక్టీరియా నశించడంతో పాటు పిల్లలు పుష్టిగా తయారవుతారు. నిమ్మజాతి పండ్లను తినిపించడం వలన దగ్గు శ్వాసకోశ వ్యాధులను అరికట్టవచ్చు.. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి వాటిని పిల్లలకు తినిపించడంతో వారు బలంగా తయారవవడంతో పాటు వారి మెదడు ఎదుగుదల కూడా బాగుంటుంది. క్యారెట్ ను పిల్లలకు తినిపించడం వలన విటమిన్ ఏ, జింక్, కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకు నూనె వస్తువులకు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచడం కూడా చాలా ఉత్తమం.