గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ విజయం వెనక రాజకీయవ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీం కృషి కూడా కొంత ఉంది. అయితే ఆ తరువాత జగన్ సీఎం అయినప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ ఏపీ ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోలేదు. జగన్ మాత్రం పీకే తో మర్యాద పూర్వక వాతావరణాన్నే కొనసాగిస్తున్నారు. కానీ ఈ మధ్య పీకే ప్రభుత్వంలో జోక్యం చేసుకోబోతున్నారు అనే వార్తలు కొన్ని మీడియాలో వచ్చాయి. గ్రామ, వార్డు వాలంటీర్ల పనిని పర్యవేక్షించేందుకు పీకే టీమ్‌ రంగంలోకి దిగిందని కొన్ని పుకార్లు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థను ప్రవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇస్తున్నారంటూ టీడీపీ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పీకే టీం స్పందించింది.

ప్రశాంత్ కిషోర్ ఏపీ ప్రభుత్వంతో పనిచేస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని అవన్నీ అబద్దపు ప్రచారాలని పీకే టీం కొట్టిపారేసింది. అలాంటి ప్రచారాలని నమ్మవద్దని కోరింది. మేము ఇంతవరకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఏ ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం అవ్వలేదని స్వష్టం చేసింది. ఓ దినపత్రికలో తమ మీద వచ్చిన ఆర్టికల్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేసింది పీకే టీం.

pk team twittar

నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ఆర్ లాగా జగన్ కూడా చరిత్రలో నిలిచిపోవాలి

బ్రేకింగ్: యుద్ధ భూమిలో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన..!