సీఎం జగన్ తాను పాదయాత్ర మొదలుపెట్టే ముందు శ్రీవారిని దర్శించుకొని, పాదయాత్ర ఇచ్చాపురంలో ముగించిన తరువాత ట్రైన్ లో నేరుగా తిరుపతి చేరుకొని అక్కడ నుంచి ఖాళీ నడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండటం వలనే తాను సీఎంగా ఎన్నికయ్యాయని అపారమైన నమ్మకం ఉంటుందట. అందుకని సీఎం జగన్ సర్కార్ తిరుమల కొండపై తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

శ్రీవారి కొండపై లడ్డులను ప్లాస్టిక్ కవర్లలో భక్తులు తీసుకొని వెళ్లడం జరుగుతుంది. దీని వలన శ్రీవారి కొండపై ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు తయారవ్వడంతో పాటు చుట్టూ పక్కల పరిసర ప్రాంతాలలో కూడా వాటిని పడేయడంతో కొండపై ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి. ఇప్పుడు అసలు తిరుమల కొండపై ఎక్కడ ప్లాస్టిక్ అనేదే కనపడకుండా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.

సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ అనేది కనపడకుండా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు లాంటివి అన్నింటిని దశల వారికి వచ్చే సంక్రాంతి నాటికి పూర్తిగా తొలగించనున్నారు. ఇక ప్లాస్టిక్ స్థానంలో భక్తులకు లడ్డులను కాగితపు బాక్సులలో అందించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కాగితపు పెట్టేలు, జనపనార సంచులను అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు లడ్లు ఇచ్చే పెట్టేలపై శ్రీవారి చిత్ర పటాలు ముద్రించి ఇస్తున్నారు.

ఇక ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్ ల స్థానంలో పేపర్ కప్పులను, పేపర్ ప్లేట్లను వాడనున్నారు. ఇప్పటికే తిరుమలలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సామాన్య భక్తులు కూడా L1 దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తున్నారు. గతంలో L1 దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు బ్లాక్ లో టికెట్ దాదాపుగా 10 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు బ్లాక్ దందా అరికట్టడంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ కు మీరు నేరుగా విరాళం ఇచ్చి వివివిఐపీ దర్శనం చేసుకునే సదవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో మందు షాపులో పూర్తిగా రద్దు చేయాలని దశల వారీగా ఈ ప్రతి పాదన చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి తిరుపతితో పాటు తిరుమల మొత్తం శ్రీవారి గోవిందనామాల నామస్మరణే మాత్రమే వినపడనుంది.