దేశంలో కరోనా వైరస్ తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి పంపిణీ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ పై పలు కీలక సూచనలు చేశారు. దేశం మొత్తం పెద్ద ఎత్తున టీకా పంపిణి కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలనీ ఆదేశించారు. భారత్ సహా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు. దేశంలో ప్రతి ఒక్కరికి టీకా అందేందుకు నాలుగు మార్గదర్శకాలను సూచించారు. వ్యాక్సినేషన్‌లో కీలకమైన మెడికల్ సరఫరా గొలుసు ఎవరికి ముందు ఇవ్వాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

తొలి సూచిన: కరోనా వైరస్ భారిన పడేందుకు అధికంగా ముప్పు ఉన్న వారిని గుర్తించి వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యేతర కరోనా యోధులు ముప్పు పొంచి ఉన్న ప్రజలకు ముందుగా ఇవ్వాలని ప్రధాని మోదీ తొలి సూచన చేశారు.

రెండో సూచిన: టీకా ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో ఎవరెక్కడున్న ఆ ప్రాంతానికి వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందే. టీకా పంపిణీకి అడ్డుపడేలా ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.

మూడో సూచిన: టీకా అందరికి అందేలా సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చూడాలి. ఎవరు టీకాకు దూరం కాకూడదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.

నాల్గవ సూచన: వ్యాక్సిన్ ఉత్పత్తి నుండి పంపిణి వరకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిత్యం పర్యవేక్షణ ఉండాలి. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలి. నిర్ణిత సమయంలో సమర్ధంగా టీకాలు వేసేందుకు వివిధ సాంకేతిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలి.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అన్‌లాక్‌ 2.0 పై కీలక వ్యాఖ్యలు..!

టిక్ టాక్ పోతే పోయింది.. ‘చింగారి’ వచ్చిందిగా..!