వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అప్పట్లో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు, కాంట్రాక్టులలో అవినీతిని ఎండగడుతూ 20 శాతం కన్నా తక్కువ పనులు చేసి ఉంటే వాటిని రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్తామని జగన్ ఇప్పటికే సెలవిచ్చాడు. ఇక దానికి సంబంధించిన బిల్ కూడా అసెంబ్లీకి రానుంది.

ఇక మరోవైపున పోలవరంతో పాటు పీపీఏలపై కూడా జగన్ ప్రభుత్వం సమీక్ష జరిపింది. ఇందులో పీపీఏలను సంబంధించి జగన్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మొండి చెయ్యి లభిస్తుంది. ఇలా పీపీఏలను రద్దు చేసుకుంటూ పోతే పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారని ఇంకా రకరకాల కథలు చెబుతున్నారు. జగన్ మాత్రం అసలే కష్టాలలో ఉన్న రాష్ట్రానికి ఇలా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనవలసిన పనేమిటని వాదిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం జగన్ కు సహకారం రాకపోగా వాటిని కొనసాగించాలని ఆదేశాలు వస్తున్నాయట.

ఇక పోలవరం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతుంటే… కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్ సాక్షిగా అసలు తమ వరకు పోలవరంలో అవినీతి జరిగినట్లు రాలేదని చెప్పి మరోసారి సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అందరూ ఏపీకి మోదీ నిధుల వరద కురిపిస్తాడని, జగన్ – మోదీ ఒక్కటే అని ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఈ రెండు నెలలుగా ఏపీ ప్రభుత్వానికి నిధులు ఇవ్వకపోగా జగన్  కోరుకున్నట్లు పీపీఏల రద్దు , ఇంకా పోలవరం విషయంలో అవినీతి, ఏపీకి ప్రత్యేక నిధితో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటున్నట్లు కనపడుతుంది. ఏపీలో తమ పట్టు నిలుపుకోవాలనుకుంటున్న బీజేపీ కావాలనే ప్రతి దానికి ఏపీ ప్రభుత్వానికి అడ్డుపుల్ల వేస్తూ ఏపీ ప్రజలలో వైసీపీని బద్నామ్ చేయడానికి చూస్తున్నట్లు కనపడుతుంది
  •  
  •  
  •  
  •  
  •  
  •