భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు చేరుకున్నారు. ఒకపక్క సరిహద్దులో భారీగా చైనా బలగాలు మొహరిస్తున్న తరుణంలో మీడియాకు ఏ విధమైన సమాచారం లేకుండా మోదీ లద్దాఖ్ పర్యటనకు వెళ్లారు. యుద్ధ భూమిగా ఉన్న ఆ ప్రాంతంలో మోదీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అంతర్జాతీయ సమాజం కూడా దీనిపై ఆసక్తిగా ఉంది.

జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన సైనికులను సైతం మోదీ పరామర్శించనున్నారు. సైనికులకు భరోసా ఇవ్వడం చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందట..!

గుడ్ న్యూస్: ఆగష్టు 15న మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్..!