దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రసంగించారు. కరోనా వైరస్ పై పోరాటంలో ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ముందంజలో ఉందన్నారు. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్యను చూస్తే ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. సరైన సమయంలో లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా వైరస్ అదుపులో ఉందన్నారు. కానీ అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుండి మళ్ళీ కేసులు పెరుగుతున్నాయని.. కొద్దిరోజుల నుండి మాస్కులు వేసుకోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం కనపడుతుందన్నారు. లాక్ డౌన్ సమయంలో నిభందనలు చాలా కఠినంగా పాటించారు.. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇక ఈ ప్రసంగంలో ప్రధానంగా ప్రధానమంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత రేషన్ పధకాన్ని ఐదు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ పధకం నవంబర్ వరకు దేశంలో వర్తిస్తుంది. ఈ పధకం కింద పేదలకు 5 కిలోల ఉచిత గోధుమలు లేక బియ్యం, ఒక కిలో పప్పు దినుసులు ఇస్తున్నారు. నవంబర్ వరకు ఈ పధకాన్ని అమలు చేయడానికి 90 వేల కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు. ఇక ఈ పధకం ప్రారంభం నుండి నవంబర్ వరకు 1.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో, పేదలు ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన, పౌర సమాజం అందరికీ ఆహారాన్ని అందించాయని ప్రధాని గుర్తుచేశారు.

టిక్ టాక్ పోతే పోయింది.. ‘చింగారి’ వచ్చిందిగా..!

చైనీస్ యాప్‌లను భారత్ నిషేదించిన నేపథ్యంలో డ్రాగన్ తన వక్ర బుద్దిని చాటుకుంది..!