పోకో ఎం2 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం2 ను ఆవిష్కరించారు. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. 6 జిబి ర్యామ్+64 జిబి స్టోరేజ్ వేరియంట్ ను రూ.10999 గాను, 6 జిబి ర్యామ్+128 జిబి స్టోరేజ్ వేరియంట్ ను రూ.12499 గాను నిర్ణయించారు. పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్టు ద్వారా కొనుకోలు చేయవచ్చు.

పోకో ఎం2 పీచర్స్:
6.53 అంగుళాల స్క్రీన్
1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్
6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్,128 జిబి స్టోరేజ్
మీడియా టెక్ హీలియో జి 80 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
8 జిబి మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా
13+8+5+2 మెగా పిక్సెల్స్ క్వాడ్ రియర్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటిరి సామర్థ్యం