పోకో మరో కొత్త స్మార్టు ఫోన్ ను విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ అందుబాటు ధరలో పోకో ఎక్స్ 3 పేరుతో ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోకో ఎక్స్ 2 ఫోన్ కి కొనసాగింపుగా దీన్ని తీసుకురావడం జరిగింది. గత నెలలో యూరప్ లో లాంచ్ అయిన పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్సి మాదిరిగానే దీన్ని కూడా రూపొందించారు. ఇక మూడు వేరియంట్లు, కో బాల్డ్ బ్లూ, షాడో, గ్రే రంగుల్లో పోకో ఎక్స్ 3 లభ్యం అవుతుంది.

6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16999, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18499, హైఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999

పోకో ఎక్స్ 3 ఫీచర్లు:
6.63 అంగుళాల ఫుల్ హెచ్ డి+డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఏంఐయూఐ 12
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్
64+13+2+2 మెగా పిక్సెల్ రియర్ క్యాడ్ కెమెరా
20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటిరి