కరోనా వైరస్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు(64) శనివారం ఉదయం మృతి చెందారు. కరోనా సోకడంతో ఆయన గత కొన్ని రోజులుగా హోం క్యారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. రామారావు సోదరుడు పోకూరి బాబురావు ఈతరం ఫిలిమ్స్ స్థాపించి అనేక విజయవంతమైన సినిమాలను తీశారు.

నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ఈతరం ఫిలిమ్స్ లో తెరకెక్కాయి. ఇక ఈతరం ఫిలిమ్స్ పై తెరకెక్కిన సినిమాలకు పోకూరి రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. పోకూరి రామారావు మృతి చెందడంతో సినిమా పరిశ్రమ దిగ్బంతికి గురైంది. ఆయన అకాల మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

బీజేపీ మాజీ మంత్రికి కరోనా పాజిటివ్..!

ఏపీ ఆర్టీసీలో కీలక పరిణామం.. బస్సు కండక్టర్లకు కొత్త ఉద్యోగం..!