సినీ నటుడు అల్లు అర్జున్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప’ సినిమా యూనిట్ పై కూడా పిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా చిత్ర యూనిట్ సభ్యులు కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ.. జలపాతాన్ని సందర్శించడంతో పాటు తిప్పేశ్వర్ లో అనుమతులు లేకుండా షూట్ చేశారని సమాచార హక్కు ప్రధాన కార్యాదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పిర్యాదు స్వీకరించిన పోలీసులు దీనిపై ప్రాథమిక విచారణ చేపడతామని తెలియచేసారు.

‘ఖైదీ’ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్..!

వైసీపీ ఎంపీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..!

అప్పట్లో సిరియా అధ్యక్షుడిని చంపించాలనుకున్నా, కానీ వదిలివేశానని గొప్పలు చెబుతున్న ట్రంప్