తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ పై పోలీసులకు పిర్యాదు చేసాడు. గూగుల్ మ్యాప్స్ వల్ల తన కాపురంలో కలతలు వచ్చాయని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమిళనాడులో మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్‌ నగర్‌కు చెందిన ఆర్ చంద్రశేఖరన్ అనే వ్యక్తి ప్రతి రోజు ఆఫీస్ నుండి రాగానే ఫోన్ తన భార్య చేతికి ఇస్తాడు. ఆమె గూగుల్‌ మ్యాప్స్‌లోని ‘యువర్‌ టైమ్‌లైన్’‌ సెక్షన్‌లోకి వెళ్లి అతడు రోజంతా ఎక్కడికి వెళ్ళాడు అనేది పరిశీలిస్తుంది. ఈ క్రమంలో మే 20 వ తేదీన అతని భార్య గూగుల్ మ్యాప్స్ చెక్ చేసింది.

దీంతో ఆ రోజు అతను వెళ్లిన ప్రదేశాలకు గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన దానికి పొంతన లేదు. దీంతో భార్యాభర్తల ఇద్దరు మధ్య కలతలు మొదలయ్యాయి. ఇక దీంతో గొడవలు ఎక్కువవడంతో విసుగు చెందిన చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి గూగుల్ మ్యాప్స్ పై పిర్యాదు చేసాడు. గూగుల్‌ మ్యాప్‌ టైమ్‌లైన్‌లో చూపించిన ప్రదేశాలకు నేను ఇంతవరకు వెళ్లలేదని.. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మా కాపురంలో గొడవలు మొదలయ్యాయని చెప్పారు. కావున గూగుల్ మ్యాప్స్ యాప్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంబులెన్స్ లో గర్భిణీ.. అడ్డుతగిలిన సింహాలు..!

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!