సినీనటి మాధవిలతకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవంటూ మాధవీలత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ కొంచెం ద్రుష్టి పెట్టాలని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీతో పాటు, తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఈ విషయంపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు.

ఈ విధంగా ఆరోపణలు చేస్తే సరిపోదని, ఎవరు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారన్న విషయంపై సరైన ఆధారాలు కావాలన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశామని టాలీవుడ్ సెలబ్రిటీలను విచారించామని.. కొందరిని నిఘాలో పెట్టామని పోలీసులు తెలియచేసారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరి ఈ విషయంపై మాధవీలత స్పందిస్తుందో లేదో చూడాలి.

తిరుమల వీధుల్లో మరోసారి చిరుత సంచారం..!

ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ టీవీ యాంకర్..!