ఏపీలో మందు బాబులకు కావలసిన బ్రాండ్ మందు దొరకకపోవడంతో పాటు విపరీతంగా మద్యం రేట్లు పెంచేయడంతో తెలంగాణ సరిహద్దుల నుంచి అక్రమ మద్యాన్ని యథేచ్ఛగా రాష్ట్రం దాటించేస్తూ లక్షల రూపాయలను సంపాదించేస్తున్నారు. కొంతమంది అడ్డంగా బుక్కవుతుంటే మరికొంత మంది మాత్రం ఎంచక్కా మద్యం ఏపిలోకి తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. దీనితో పోలీసులు గస్తీని మరింత ముమ్మరం చేయడంతో పాటు చెకింగ్ పోస్టులు పెంచడంతో వారు చూపిస్తున్న అతి తెలివికి పోలీసులే విస్తుపోతున్నారు.

తెలంగాణ జోగులాంబ జిల్లా నుంచి కర్నూల్ మద్యం సరఫరా చేయడానికి కొంతమంది యువకులు బురఖా ధరించి సరఫరాకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. వారు మద్యం బాటిళ్లను పెట్టుకొని బురఖా వేసుకొని వెళుతుండగా, మహిళలని పోలీసులు ఆపకుండా పంపించివేస్తారని భావించగా అక్కడ ఉన్న ఒక పోలీసు అధికారి గమనించి వారిని బురఖా తీయమని కోరడంతో వారు అడ్డంగా దొరికిపోయారు. దీనితో వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఇలా ఎవరికివారు పోలీసులు మెదడులకు పదును పెట్టేలా అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటే ఇలా కొంతమంది అడ్డంగా బుకైపోతున్నారు. ఇలా అక్రమ మద్యం యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా మద్యం రేట్లను కాస్త తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముగిసిన రానా-మిహిక పెళ్లి వేడుక, హాజరైన అల్లు అర్జున్

లాక్ డౌన్ తో ఉద్యోగం పోవడంతో కన్న కూతుర్లను చంపేసుకున్న ఒక నిస్సహాయకుడు

పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని పొడిచి చంపిన ప్రేమికుడి తండ్రి