ఎన్ని ప్రభుత్వాలు మారిన, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా పేకాట రాయుళ్లను నిరోధించడం మాత్రం పోలీసులకు, ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతుంది. పోలీసులు ఎన్ని ఎత్తులు వేసి జూదం నిర్ములించాలని పేకాట ఆడే వారిని అరెస్ట్ చేసి జైలులో పెడుతున్నా వారు బయటకు వచ్చి పోలీసులకు దొరక్కుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎంచక్కా జూదం అనే మత్తులో ఊగిపోతున్నారు. ఏదైనా ప్రాంతం లేదా, దొంగ చాటుగా రూమ్ లు తీసుకుని జూదం ఆడుతున్నా పోలీసులు కనిపెట్టడంతో ఇప్పుడు రూటు మార్చి కొత్త ఎత్తులు వేయడంతో పోలీసులు ఔరా అనుకుంటున్నారు.

మినీ వ్యాన్ లాంటిది ఒకటి మాట్లాడుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ మార్గ మధ్యలో పేకాట ఆడుతూ పోలీసులు కళ్ళు కప్పి జూదం ఆడే గ్యాంగ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయట. ఇళ్ల మధ్యలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నా, ఊరు శివార్ల తోటలలో ఆడుతున్నా ఎవరో ఒకరు కంప్లైన్ట్ ఇవ్వడం పోలీసులు పట్టుకెళ్ళడం ఇదంతా పరిపాటిగా మారడంతో పాటు హోటల్ రూమ్స్ కూడా పోలీసులు సులువుగా పసిగట్టి పట్టేయడంతో ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పేకాట ఆడితే పట్టుకునే వారు ఎవరు ఉండరని ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. దీనితో తాము ఎంతటి పన్నాగాలైనా పన్నుతాం తప్ప పేకాట మాత్రం వదిలే సమస్య లేదని సవాళ్లు విసురుతూ లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల రూపాయలు పోయినా పేకాట వ్యసనం పట్టినవాడు దానిని వదిలే ప్రసక్తే లేదని మనకు గత చరిత్రలు చెబుతున్నాయి.

బాహ్య ప్రపంచానికి దూరంగా బతికే 53 మంది ఆదివాసీలలో నలుగురికి కరోనా

మీ పిల్లలు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారో గమనిస్తున్నారా లేదా?

10 రూపాయల కోసం ఆలోచిస్తే, రెండు లక్షల రూపాయలు చిల్లుపడింది