పార్టీలు మారే వారికి బుజ్జగింపులు… పార్టీలో ఉండే వారిని కరివేపాకులా తీసేసే రోజులు ఇవి. ఎవరినైనా పార్టీలో పట్టించుకోవడం లేదని భావిస్తే ముందు పార్టీ మారుతున్నట్లు తెలిసిన మీడియా ప్రతినిధులకు ఉప్పందిస్తే మొత్తం కథ వాళ్ళే నడిపిస్తారు. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణం అయిపోయాయి. ఇక ఏపీలో అయితే మరీ ఎక్కువ. గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి జంపింగ్ జపాంగులను అంత పట్టించుకునే వాడు కాదు. పార్టీ మారవద్దని ఒకటి, రెండు సార్లు దూతలను పంపించేవాడు. కాదు కూడదని బెట్టు చేస్తే పోవయ్యా.. పో వెళ్లి ఏమి చేస్తావో నేను చూస్తా అని హుంకరించేవాడు. ఇక ఇలా పార్టీలు మారిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటేనే అర్ధమవుతుంది అనుకుంట. 

ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఇక తెలుగుదేశం నేతలు… బాబు తమను పట్టించుకోవడం లేదని ఒకరు మరొకరు అభివృద్ధి పేరుతో అని రకరకాలుగా వింత వింత పేర్లు పెట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్ళాలి అనుకునే వారు… వెళ్తున్నట్లు నటించేవారు… బిల్డ్ అప్ ఇవ్వడం మొదలెట్టారు. కానీ చంద్రబబు నాయుడు… మొదటి నుంచి అంత డేరింగ్ గా రాజకీయాలు చేసే సాహసం చేయలేదు. అందుకే వారికి తాయిలాలు ఇచ్చి మరీ బాబ్బాబు పార్టీ మారవద్దు, మీకు కావలసిందే మనం అధికారంలో లేకపోయినా అందచేయడానికి సిద్ధంగా ఉన్నానని బుజ్జగింపులు పర్వానికి దిగుతున్నారు. 

కారణం 23 సీట్లతో బక్కచిక్కిపోయిన పార్టీకి అండగా నిలబడకుండా ఒకరి వెనుక ఒకరు జారిపోతారేమో అన్న భయం. అందులో భాగంగానే విజయవాడకు చెందిన నాయకుల బెదిరింపులు కాస్త ఎక్కువగా ఉంటున్నాయట. మమల్ని పట్టించుకోవట్లేదు అని అలుగుతున్న వారి ఇళ్లకు రోజుకి ఒక నలుగురైదుగురు నాయకులు ఆ నాయకుడి ఇంటికి వచ్చి చంద్రబాబు దూతలమని చెబుతుంటే వారిల్లు మాంచి సందడి వాతావరణం కనపడుతుందట. అసలు కావలసిందే ఇది కదా… కోరుకుందే ఇది కదా… ఇలాగే కొన్ని రోజులు టెంపో మైంటైన్ చేస్తే చంద్రబాబు తాయిలాల్తో పాటు, ఓడిపోయిన పార్టీ మారతాన్నడు అంటూ… కాని రోజులు మీడియాలో నలగవచ్చని వారు కూడా ఆలోచిస్తున్నారట. రాజకీయాలలో ఎన్ని కొత్త దారులు అందులో ఎన్ని ఎత్తులు.. పై ఎత్తులు… వాటిలో ఇదో రకం.   

  •  
  •  
  •  
  •  
  •  
  •