సినీ నటుడు భానుచందర్ వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాసంకల్పయాత్ర చివరి రోజు వైసీపీలో చేరిన భానుచందర్ ఈ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయిద్దన్నారు. ఏపీని బాగు చెయ్యాలంటే జగన్ సీఎం కావాలని.. ఆయన సీఎంగా 2019 నుండి 20 సంవత్సరాల పాటు ఉంటారన్నారు. కాగా భానుచందర్ డిసెంబర్ లో పాదయాత్రలో పాల్గొని జగన్ ని కలసిన విషయం తెలిసిందే.

jagan bhanu chandar