సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలలో వలసలు ఊపందుకుంటున్నాయి. వివిధ పార్టీల నాయకులూ తమకు అనుకూలమైన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పచ్చ కండువా కప్పుకోబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ సాయంత్రం కాండ్రు కమల టీడీపీలో చేరనున్నారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన కాండ్రు కమల.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Kandru Kamala