జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనసేన పార్టీ వామపక్షాలతో పొత్తు ఖరారైంది. శుక్రవారం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీకి బలం లేదని చెబుతూ వైసీపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకు సంబంధించి తెరాస నాయకులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. ప్రజలలో తమ పార్టీ బలానికి ఇదే నిదర్శనం అన్నారు. అసలు జనసేనతో పొత్తు కోసం రాయభారం నడుపుతున్న ఆనేతలు ఎవరో పవన్ వెల్లడించలేదు. జనసేనతో వైసీపీ పొత్తు కోసం తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యాయి.

అలాగే 2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు పలికితే ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుండి కొందరు దళితులు వచ్చి తమ ఎమ్మెల్యే వేధిస్తున్నారని చెప్పారని.. కానీ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

25 కిలోల బియ్యం మాకు అవసరంలేదు 25 ఏళ్ళ భవిశ్యత్ ఇవ్వండని యువత తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలియ చేశారు. ఇప్పుడు తమ పార్టీలో కొత్త వారు చేరిన ఎప్పటి నుండో పార్టీకి వెక్కుముకగా నిలిచిన వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు. అలాగే జనసేన పార్టీకి సామాన్యుడు టీ గ్లాస్ గుర్తు రావడం అనుకూలించే విషయం అన్నారు పవన్ కళ్యాణ్.