ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది.2014 బీజేపీలో చేరిన పురందేశ్వరి.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఆమెకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఎన్టీఆర్ కుమార్తె ఇప్పుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి బలాన్ని ఇచ్చే అంశమే అవుతుంది. దీనిపై కొంత కాలంగా ప్రచారం సాగుతున్న జగన్ పాదయాత్ర ముగింపు సమయానికి ఓ క్లారిటీ వచ్చింది.

ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడం లాంఛనంగా మారింది. దాదాపుగా అన్ని రకాలుగా చర్చలు ముగిశాయి. పురందేశ్వరి కుమారుడు హితేష్ కు పర్చూరు సీటు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. పర్చూరు నుండి తన కుమారుడు పోటీ చేస్తే ఏవిధంగా ఉంటుందనే దానిపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ సర్వే కూడా చేయించారట. వైసీపీ నుండి పోటీ చేస్తే సానుకూలంగా ఫలితాలు వస్తుండడంతో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. పర్చూరు సీటు ఇవ్వడానికి జగన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇక పురందేశ్వరి పోటీ చేసే పార్లమెంట్ పైన కొంత కన్ఫ్యూషన్ ఏర్పడింది. పురందేశ్వరి తనకు గుంటూరు లోక్ సభ సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. కానీ జగన్ మాత్రం విశాఖ సీటు ఇస్తామంటున్నారు. పురందేశ్వరి 2009 ఎన్నికల్లో విశాఖ కాంగ్రెస్ ఎంపీ గా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న పురందేశ్వరి.. ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు.