తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఆయన నియోజకవర్గమైన కొడంగల్లో షాక్ తగిలింది. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి అనుచరుడైన విశ్వనాథ్ నిటూరు గ్రామం నుంచి కాంగ్రెస్ తరుఫున సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఆయనను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకూ అతడి ఆచూకీ తెలియరాలేదు. నామినేషన్ కు ఇదే ఆఖరి రోజు కావడంతో ఆయనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఆయన ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి ఉంటారని రేవంత్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.

తన అనుచరుడు కిడ్నాప్ అయ్యాడన్న విషయం తెలుసుకున్న రేవంత్ హుటాహుటిన నిటూరు గ్రామం చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులు దగ్గర వివరాలు తెలుసుకుని.. పోలీసులకు పిర్యాదు చేసారు. విశ్వనాధ్ బరిలో లేకుంటే తెరాస పార్టీ ఈజీగా గెలవచ్చనే దురుద్దేశంతో తెరాస పార్టీ వారే కిడ్నప్ చేశారని.. రేవంత్ రెడ్డి మీడియాకు తెలియ చేశారు.