టాలీవుడ్ లో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ మధ్య ఆమె నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్, అఖిల్ ఇంకా పలు సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉంది. కాగా పూజా హెగ్డే.. మరో క్రేజి అవకాశాన్ని దక్కించుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే అవకాశం లభించింది. పర్హాత్ షామ్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బచ్చన్ పాండి’ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా, మరో హీరోయిన్ గా పూజా హెగ్డే సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే పూజా ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతుంది.