‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్ తరువాత పూజా హెగ్డే ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తుంది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక తాజాగా ముంబై ఎయిర్ పోర్టు నుండి బయటకి వస్తున్న పూజా హెగ్డేతో ఫోటోలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు.

ఆమెతో ఓ అంకుల్ కూడా సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డాడు. అయితే ఆయన పూజాతో సెల్ఫీ దిగడానికి పడిన ఆరాటం నవ్వుతెపిస్తుంది. కానీ ఆయనకు ఫోన్ పట్టుకోవడం చేతకాకపోవడమో.. లేక ఫోటో తీయడం రాకపోవడమో మరి అక్కడున్న వారంతా పూజా హెగ్డే తో సహా నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే ఆయన వెనకొచ్చిన చాలా మంది ఫ్యాన్స్ పూజా తో ఫోటో దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.