చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఎంతటి దిక్కిమాలిన ఆరోపణలైన చేయించడానికి వెనకాడే వ్యక్తి కాదు. చిరంజీవి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడుకి చిరంజీవిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చిరంజీవి కుటుంబంపై చేయించిన ఆరోపణలు ఎంతో జుగుత్సాకరమైనవని, దానితో చిరంజీవి దాదాపుగా రెండు నెలలు పాటు మాట్లాడకుండా తనలో తాను కుమిలిపోతూ రాజకీయ నాయకులు ఇంత దారుణంగా దిగజారుతారా అని బాధపడ్డారట. ఈ విషయాన్ని పోసాని కృష్ణ మురళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అప్పట్లో చిరంజీవి చిన్న కుమార్తె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనితో చిరంజీవి నుంచి ఓటర్లను దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏకంగా చిరంజీవి కూతురుపై టీడీపీకి చెందిన ఒక మహిళ నేత చేత ఆరోపణలు చేయించాడు. కూతురునే సరిగ్గా పెంచలేని వాడు ఇంకా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా అనేలా ఆరోపణలు చేయించడంతో చిరంజీవి రాజకీయాలలోకి తన కుటుంబాన్ని లాగడంపై చాలా బాధపడ్డట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న పోసాని కృష్ణ మురళి… చిరంజీవి కుటుంబంపై చేయించిన ఆరోపణలపై గట్టిగానే తిప్పికొట్టారు. ఆ సందర్బాల్లో చిరంజీవి కన్నీటి అపర్యంతమవ్వడం తాను చూసి చలించిపోయానని పోసాని చెప్పుకొచ్చారు.