పోసాని కృష్ణ మురళీ నిజాయితీగా, నిబద్ధతతో కుండ బద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడన్న విష్యం సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కొద్ది రోజుల క్రితం పోసానికి మేజర్ సర్జరీ ఒకటి జరిగింది. బెడ్ మీదే రెస్ట్ తీసుకుంటున్న పోసాని, ఒక మీడియా ఛానల్ కు వైఎస్ జగన్ గెలుపు తరువాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో సినిమా ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల గురించి పలు విషయాలు మాట్లాడారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేసినా విమర్శిస్తానని, కానీ జగన్ తప్పు చేయడన్న సంగతి నాకు తెలుసునని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా అందరూ తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావ అని ఇక పైకి లేచే పరిస్థితి లేదంటున్నారని, కానీ రాజకీయాలలో ఒడిదుడుకులు సర్వసాధారణమని అలాంటిది జరగకపోవచ్చని అనుకుంటున్నానని అన్నారు.

వైసీపీ పార్టీకి అండగా ఉన్నందుకు ఎన్నికల ముందు తనకు సినిమా ఆఫర్స్ తగ్గిన మాట నిజమేనని, కానీ నేను అంటే ఇష్టపడే కొంత మంది నన్ను ఆదరించి వారి సినిమాలలో ఆఫర్స్ ఇచ్చారని అన్నారు. తనను కొన్ని సినిమాలలో సెలెక్ట్ చేసిన తరువాత తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటం లేదని తనను లిస్ట్ లో నుంచి
తీసేయించారని, ఆ వ్యక్తి ఎవరో కాదని సీనియర్ నిర్మాత అశ్వినీదత్ అని చెప్పి పెద్ద బాంబు పేల్చారు. పోసాని వ్యాఖ్యల పట్ల ఇంత వరకు అశ్వినీదత్ స్పందించిన దాఖలాలు లేవు. ముందు ముందు రోజులలో ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •