రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో మొత్తం మూడు సినిమాలను తీసి మొదటి రెండు సినిమాలకు ఒక మోస్తరు డబ్బులు సంపాదించినా ఆ తరువాత ఏకంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాకు ఏకంగా కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. తన సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులే ఆవేశంతో ముందుగా టిక్కెట్ కొంటారని ఎన్నో కలలు కంటే అది మాత్రం బెడిసి కొట్టి వర్మ అంచనాలన్ని తప్పినట్లు తెలుస్తుంది. వర్మకు కోట్ల రూపాయల సంగతి తరువాత ఎంత మంది తన సినిమా చూసారని చెప్పుకోవడానికి కూడా నోరు పెగలడం లేదు.

అదే లాక్ డౌన్ సమయంలో ‘క్లైమాక్స్” పేరుతో పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఎంత మంది చూసారో కూడా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సూపర్ డూపర్ హిట్, కలెక్షన్స్ అదుర్స్ అంటున్నారే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ముందుగానే ప్రచారం చేస్తూ ఎవరు డబ్బులు పెట్టి సినిమా చూడవద్దని, సినిమా విడుదలైన గంటలోనే పైరసీ వచ్చేస్తుందని, ఒక గంట వెయిట్ చేస్తే పైరసి చూసేయవచ్చని ప్రచారం చేయడం కూడా వర్మ అంచనాలు బెడిసికొట్టినట్లు కనపడుతుంది.

దీనితో ఒకవైపున పస లేని ప్లాప్ సినిమాతో పాటు మెగా అభిమానులకు కలెక్షన్స్ కూడా రాలేదన్న ఆనందంలో ఉన్నారు. ఇక రాబోయే రోజులలో వర్మ మెగా కుటుంబంపై తప్పుడు మాటలు, తప్పుడు రాతలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయాలని చూసినా అతడిని పట్టించుకోకపోతే, అతడే సైలెంట్ అయిపోతాడని వ్యాఖ్యానాలు చేస్తున్నారట. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ కూడా ముందు నుంచి ఆచితూచి వ్యవహరించి వర్మపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మెగా కుటుంబానికి “పవర్ స్టార్” సినిమా కంటెంట్ ముందే లీకైందా?

ట్యాలెంట్ లేకుండా బ్యాగ్రౌండ్ ఎందుకు పనిరాదంటున్న హీరోయిన్