రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 20వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఓ ‘డియర్’ పేరును పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. జులై 10న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా తెలియచేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ పోస్టర్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ సినిమాను వైజయంతి బ్యానేర్ పై అశ్వినీదత్ నిర్మిస్తాడు.

భారత్‌లో మొదటి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఎవరిపైనో తెలుసా..!

భారత్ లో 20000 దాటిన కరోనా మృతులు..! కేవలం వారం రోజుల్లోనే 3 వేలకు పైగా మరణాలు..!